Welcome to Sunshine Smart City – Near KIA Motors, Penukonda
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (NH-44) ఇప్పుడున్న నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారి విస్తరణకు కేంద్రం సిద్ధమైంది.
ఈ జాతీయ రహదారిలో 260 కి.మీ. మేర ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం మన రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా అవకాశం ఏర్పడుతోంది. విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతంపై దృష్టి పెడతారు. దీనికి తోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీపడతారు.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణతో దక్షిణాదిలోనే అత్యధిక వరుసల హైవేగా ఇది నిలవనుంది, ఇది భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు దోహదపడుతుంది.
ఈ జాతీయ రహదారికి సమీపంలో నాలుగు విమానాశ్రయాలు ఉండటంతో పారిశ్రామికవేత్తలు దీనిపై మొగ్గు చూపుతున్నారు:
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో భూముల ధరలు భారీగా ఉండటంతో, పరిశ్రమల ఏర్పాటుకు అనంతపురం జిల్లా ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. విద్యుత్, నీటి కొరత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇటు వైపు చూస్తున్నారు. దీనివల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇది సీమ జిల్లాలకు వరంలా మారనుంది.