Welcome to Sunshine Smart City – Near KIA Motors, Penukonda
ఆంధ్రప్రదేశ్‌లో 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ (SIPB) సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
ఈ సమావేశంలో మొత్తం 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రధానమైన ప్రాజెక్టులు ఇవే:
బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ద్వారా వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రానికి రూ.88 వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సంస్థలు దాదాపు రూ.83 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి అదనంగా రూ.4 వేల కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాలు పారిశ్రామికంగా మరింత బలోపేతం కానున్నాయి.